Viveka Case: ఉదయ్ కుమార్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు

by Vemula.Srinu Prasad |

వివేకానందారెడ్డి హత్య కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు అయింది.....

Viveka Case: ఉదయ్ కుమార్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్య కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు అయింది. తన భార్య గర్భవతిగా ఉందని, ఆమెను చూసుకునేందుకు ఎవరూ లేరని, 15 రోజులు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఉదయ్ కుమార్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఉదయ్ కుమార్ రెడ్డి పిటిషన్‌పై వాదనలు ఈ నెల 11నే పూర్తి కావడంతో కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా ధర్మసనం ఆయనకు రెండు రోజుల పాటు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు కానిస్టేబుళ్లు వాహనంలో తీసుకెళ్లాలని, ఇందుకు అయ్యే ఖర్చు మొత్తం ఉదయ్ కుమార్ రెడ్డి భరించాలని కోర్టు సూచించింది.

కాగా వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి ఆరో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరపున వాదనలు వినిపించారు. కానీ సీబీఐ కోర్టు ఉదయ్ కుమార్ రెడ్డికి ఎస్కీర్ట్ బెయిల్ మంజూరు చేసింది.

Next Story