వాళ్లిద్దరి బానిస పవన్‌ కల్యాణ్: లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-29 15:52:41  IST  )

తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

వాళ్లిద్దరి బానిస పవన్‌ కల్యాణ్: లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ కేసు(Tirumala laddu adulteration case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నెయ్యిలో జంతువుల అవశేషాలు కలవలేదని కోర్టుకు సీబీఐ బృందంలోని సిట్ నివేదిక సమర్పించింది. దీంతో కూటమి నేతలపై వైసీపీ నాయకులు విమర్శలు కురిపిస్తున్నారు. గతంలో చేసిన విమర్శలకు తాజాగా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి(YSRCP General Secretary Lakshmi Parvathi) సైతం విమర్హల దండకం అందుకున్నారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy Cm Pawan Kalyan)పై సంచలన ఆరోపణలు చేశారు.

చంద్రబాబు, లోకేశ్ బానిస పవన్

చంద్రబాబు, ఆయన కుమారుడు, వీళ్ల బానిస పవన్‌ కల్యాణ్‌ అంటూ ఆమె సంబోధించారు. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిపై నీచమైన అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఇప్పుడు సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌తో అన్ని విషయాలు బట్టబయలయ్యాయన్నారు. ఆ నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేదని సిట్‌ తేల్చిందని గుర్తు చేశారు. అయినా చంద్రబాబులో ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా, మైండ్‌ లేకుండా మాట్లాడుతున్నారన్నారని ధ్వజమెత్తారు. గతంలో జగన్‌తో పాటు, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డిపై చంద్రబాబు చెప్పినవి అబద్ధాలేనని సిట్‌ ఛార్జ్‌షీట్‌ తేల్చేసిందన్నారు. అలా మరోసారి చంద్రబాబు దొరికిపోయారని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.

Read More.. మా అమ్మ పుట్టిన రోజు.. రెండు జిరాఫీలను అడాప్ట్ చేసుకుంటున్నా: పవన్ కల్యాణ్

Next Story