మా అమ్మ పుట్టిన రోజు.. రెండు జిరాఫీలను అడాప్ట్ చేసుకుంటున్నా: పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-29 15:51:28  IST  )

తమ అమ్మ పుట్టిన రోజు సందర్భంగా రెండు జిరాఫీలను అడాప్ట్ చేసుకుంటున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు..

మా అమ్మ పుట్టిన రోజు.. రెండు జిరాఫీలను అడాప్ట్ చేసుకుంటున్నా: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు తమ అమ్మ పుట్టిన రోజు అని, ఈ సందర్భంగా రెండు జిరాఫీ(Giraffe)లను అడాప్ట్ చేసుకుంటున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) తెలిపారు. విశాఖ జూ(Visakha zoo)ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ జంతు సంరక్షణలో భాగంగా రెండు జిరాఫీలను తాను అడాప్ట్ చేసుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా జంతు సంరక్షణకు కృషి చేయాలని పవన్ పిలుపునిచ్చారు.

అయితే అంతకుముందు జూలోని పూల తోటలను పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్‌పై సీతాకోక చిలుకలు వాలుతూ చూపరులను ఆకట్టుకున్నాయి. ఇక పవన్ కల్యాణ్ అయితే సీతాకోక చిలుకల వాలడంపై సంతోషం వ్యక్తం చేశారు.

Read More.. వాళ్లిద్దరి బానిస పవన్‌ కల్యాణ్: లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు

Next Story