- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రజలకు తీపికబురు.. ఆర్టీసీలో ఇక అన్నీ ఏసీ బస్సులే!
ఏపీ ఆర్టీసీలో త్వరలో అన్ని ఏసీ ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీపికబురు చెప్పారు. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నామని, భవిష్యత్తులో ఆర్టీసీలో కేవలం ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు (AC Electric Buses) మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. సామాన్యుడికి కూడా విలాసవంతమైన ప్రయాణాన్ని చేరువ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనకాపల్లి (Anakapally)లో జరిగిన సభలో ఆయన రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏసీ బస్సుల్లో కేవలం డబ్బున్న వారు మాత్రమే ప్రయాణించాలనే నిబంధన ఎక్కడా లేదన్నారు. పేద ప్రజలు కూడా ఎంతో గౌరవంగా, హాయిగా ఏసీ బస్సుల్లో ప్రయాణించాలన్నదే తన కొరిక అని తెలిపారు. ఆ దిశగానే రాబోయే రోజుల్లో ఆర్టీసీలో అన్ని సాధారణ బస్సుల స్థానంలో ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 5 వేల ఛార్జింగ్ స్టేషన్లు..
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 5,000 ఛార్జింగ్ స్టేషన్ల (Charging Stations)ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. దీంతో కాలుష్యం తగ్గడమే కాకుండా, రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని వివరించారు. ఇప్పటి వరకు సుమారు రూ.5.95 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వెల్లడించారు. ఆ పెట్టుబడులతో దాదాపు 4.76 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
సొంత వారినీ చంపేస్తున్నారు: వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు
వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత తీవ్ర విమర్శలు






