ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ: వైశాఖ పౌర్ణమి వేళ పునీతమైన బెజవాడ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-01 15:04:48  IST  )

వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదర్శన అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ: వైశాఖ పౌర్ణమి వేళ పునీతమైన బెజవాడ
X

దిశ, వెబ్‍డెస్క్: వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పురాణ ప్రాశస్త్యం కలిగిన ఈ పర్వదినం వేళ, దుర్గమ్మ కొలువై ఉన్న పర్వతాన్ని చుట్టి రావడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

కామధేనువు ఆలయం నుంచి శ్రీకారం

ఈ గిరి ప్రదక్షిణ ఇంద్రకీలాద్రి పాదభాగంలోని కామధేనువు అమ్మవారి ఆలయం నుంచి శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. అమ్మవారి నామస్మరణతో విజయవాడ పురవీధులు మారుమోగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా గిరి ప్రదక్షిణ మార్గంలో మంచినీరు, మజ్జిగ సౌకర్యాలను కల్పించారు. పౌర్ణమి కావడంతో ఇంద్రకీలాద్రి మొత్తం విద్యుత్ దీపాలతో కళకళలాడుతోంది.

Read More.. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. బాటగంగమ్మ గుడివరకూ క్యూలైన్ !

Next Story