- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు వేగం పెంచింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు వేగం పెంచింది. దాదాపు రూ.3,500 కోట్ల మేర అవినీతి జరిగినట్లుగా భావిస్తున్న ఈ కేసులో ఈడీ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి ఆయన వచ్చారు. పాలసీ రూపకల్పన, నిధుల మళ్లింపుపై ఆరా మద్యం కుంభకోణంపై రాష్ట్ర సిట్ (SIT) నమోదు చేసిన కేసులో విజయసాయిరెడ్డిని ఏ5 (ఐదో నిందితుడు)గా ఆయన ఉన్నారు. గతేడాది మే నెలలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ అభియోగాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరిగిన విచారణలో ప్రధానంగా ఈ కింది అంశాలపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.
మద్యం కుంభకోణం.. హవాలా ఆరోపణలు
2019-2024 మధ్య కాలంలో రూపొందించిన మద్యం విధానంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలపై ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. మద్యం కంపెనీల నుంచి వచ్చిన ముడుపులు, షెల్ కంపెనీల ఏర్పాటు, వాటి ద్వారా విదేశాలకు నగదు మళ్లించినట్లు (హవాలా) వస్తున్న ఆరోపణలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా విజయసాయిరెడ్డి వాంగ్మూలాన్ని (Statement) అధికారులు రికార్డు చేయనున్నారు.
ఈడీ ముందుకు ఎంపీ మిథున్ రెడ్డి
ఇదే కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రేపు (శుక్రవారం) ఈడీ విచారణకు హాజరు కానున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఏపీ సిట్ (SIT) చేత అరెస్ట్ అయి, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న మిథున్ రెడ్డిని మనీలాండరింగ్ కోణంలో ఈడీ ప్రశ్నించనుంది. నిధుల మళ్లింపులో ఆయన ప్రమేయంపై ఈడీ కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ స్కామ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టు బిగిస్తుండటం, వరుసగా ఇద్దరు కీలక నేతలను (విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి) విచారణకు పిలవడంతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది. రానున్న రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Read More..






