అంబటికి మరో షాక్.. విచారణ వాయిదా

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-05 11:14:57  IST  )

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు హైకోర్టులో నిరాశే మిగిలింది..

అంబటికి మరో షాక్.. విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Cm Ambati Rambabu)కు హైకోర్టు(High Court)లో నిరాశే మిగిలింది. తనపై నమోదు అయిన కేసుపై ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. అంబటి రాంబాబుకు సంబంధించి కస్టడీ, బెయిల్ పిటిషన్లు కింద కోర్టులో పీపీ వాదనలు వినిపించారు. దీంతో విచారణను జడ్జి ఈ నెల 11కు వాయిదా వేశారు. కాగా అంబటి రాంబాబు రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసును క్వాష్ చేయాలని అంబటి తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందో చూడాలి.

మా నాన్న అరెస్ట్ వెనుక కేంద్ర మంత్రి ఉన్నాడు.. అంబటి కుమార్తె సంచలన ఆరోపణలు

Next Story