- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా నాన్న అరెస్ట్ వెనుక కేంద్ర మంత్రి ఉన్నాడు.. అంబటి కుమార్తె సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు చంద్రబాబును దూషించడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు అంబటి ఇంటిపై దాడి చేశారు. ఈ పరిణామాలపై అమెరికాలో ఉంటున్న ఆయన మూడో కూతురు అంబటి శ్రీజ స్పందిస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. దేవుడు తమ పక్షాన ఉన్నాడని రాళ్లు విసిరినా అవి పూవులే అవుతాయని అన్నారు.
తన తండ్రి గుడికి వెళ్లి తిరిగి వస్తుంటే కొందరు టీడీపీ వాళ్లు కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారని దూషించారని చెప్పింది. ఈ సమయంలో తన తండ్రి కూడా ఆగ్రహానికి గురై నోరు జారారని చెప్పింది. ఇంటికి వచ్చిన అనంతరం పశ్చాత్తాపడ్డారని తెలిపింది. మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్షమాపణలు చెప్పారని అయినప్పటికీ టీడీపీ గూండాలు దాడి చేశారని చెప్పింది. పోలీసులు రక్షణ కల్పిస్తామని చెప్పి అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
రాజకీయాలతో సంబంధం లేని తమ కుటుంబ సభ్యులపై దాడి చేశారని, కాపు అంటూ బూతులు తిట్టారని చెప్పింది. ఇదంతా వెనకనుండి నటిపించింది ఓ డాక్టర్ మరియు టీడీపీ కేంద్ర మంత్రి అంటూ ఆరోపించింది. ఆ రోజు దాడి చేయడానికి ఎంతమంది వచ్చారో అంతకంటే ఎక్కువ మంది ఈ రోజు వచ్చారని తెలిపింది. మాజీ సీఎం జగన్ ఈ రోజు తమ నివాసానికి వచ్చి పరామర్శించారని చెప్పింది. చాలా సంతోషంగా ఉందని వెంకటేశ్వర స్వామి అండ ఉన్నంత వరకు మీరు వేసే ప్రతిరాయి పూవుగానే మారుతుందని చెప్పింది.






