అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-11 12:30:29  IST  )

మంగళవారం అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఎమ్మెల్సీ మధుసూదన్ కుమారుడు చైతన్య మిత్ర, వైసీపీ నేత పామిడి వీరా కుమార్తె, ఏడీసీసీ బ్యాంకు మాజీ ఛైర్‌పర్సన్ బోయ లిఖితల వివాహ రిసెప్షన్ వేడుకకు ఆయన హాజరుకానున్నారు..

అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: మంగళవారం అనంతపురం జిల్లా(Ananthapur District)లో వైఎస్ జగన్(Ys Jagan) పర్యటించనున్నారు. ఎమ్మెల్సీ మధుసూదన్ కుమారుడు చైతన్య మిత్ర, వైసీపీ నేత పామిడి వీరా కుమార్తె, ఏడీసీసీ బ్యాంకు మాజీ ఛైర్‌పర్సన్ బోయ లిఖితల వివాహ రిసెప్షన్ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. గుంతకల్లు(Guntakallu) నియోజకవర్గంలోని పామిడి(Pamidi)లో నిర్వహించనున్న ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో పామిడిలో పటిష్ట ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. జగన్ పర్యటనకు సంబంధించి భద్రతా పరమైన చర్యలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వివాహ వేడుక అనంతరం ఆయన తిరిగి బెంగళూరు బయలుదేరి వెళ్లనున్నారు.

ముగిసిన జగన్ యూరప్ పర్యటన

Next Story