- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన జగన్ యూరప్ పర్యటన
వైయస్ జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటన ముగిసింది. అర్ధరాత్రి యూరప్ నుంచి ఇండియా చేరుకున్నారు జగన్ మోహన్ రెడ్డి దంపతులు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటన ముగిసింది. అర్ధరాత్రి యూరప్ నుంచి ఇండియా చేరుకున్నారు జగన్ మోహన్ రెడ్డి దంపతులు. ఈ సందర్భంగా బెంగళూరు విమానాశ్రయంలో ఆయనకు వైసీపీ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అయితే ఎయిర్ పోర్టులో దిగిన జగన్.. రొటీన్ కు భిన్నంగా జీన్స్ షర్ట్, ప్యాంట్ తో మెరిశారు.
విదేశాల నుంచి నేరుగా బెంగుళూరు వెళ్లిన ఆయన.. అక్కడ రెండు రోజుల పాటు రెస్ట్ తీసుకోనున్నారట. ఆ తర్వాత తాడేపల్లికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అనంతరం ఎప్పటి లాగే ప్రజాక్షేత్రంలోకి జగన్ వెళ్లనున్నారు. ఇది ఇలా ఉండగా ఏప్రిల్ 26వ తేదీన తన సతీమణి భారతీ రెడ్డితో కలిసి యూరోప్ వెళ్లారు వైయస్ జగన్. ఈ క్రమంలోనే 15 రోజుల పాటు తన కూతుర్లతో గడిపిన జగన్ దంపతులు, తాజాగా ఇండియా చేరుకున్నారు.






