ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-05 02:41:12  IST  )

రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది.

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. గత నెల(జూలై)లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 691ఉద్యోగాలకు గానూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్(ABO) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ లో 691 పోస్టుల దరఖాస్తు గడువు ఇవాళ్టితో(ఆగస్టు 05) ముగియనుండగా అప్లికేషన్ గడువును పెంచారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును ఈ నెల(ఆగస్టు) 10వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటలకు వరకు పొడిగిస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో https://psc.ap.gov.in దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Next Story