- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
APPSC:అటవీశాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ!
రాష్ట్రంలోని నిరుద్యోగులకు కీలక అప్డేట్ వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు కీలక అప్డేట్ వచ్చింది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఈ తరుణంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రాష్ట్రం(Andhra Pradesh)లోని అటవీ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లో 691 పోస్టుల దరఖాస్తుకు రేపు(ఆగస్టు 05) చివరి తేదీగా ప్రకటించారు.
రేపటితో గడువు ముగుస్తుండటంతో ఇప్పటి వరకు అప్లికేషన్ చేసుకొని నిరుద్యోగ అభ్యర్థులు మంగళవారం అర్ధరాత్రి 11:59 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పారు. ఇందులో : 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు వయసు 18 నుంచి 34 మధ్య ఉండాలి. వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. ఇంటర్‌తో పాటు శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి. జీతం నెలకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు రూ. 25,220 - 80,910, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు రూ. 20,000 - 70,000 వరకు వేతనం ఉంటుంది. అభ్య ర్థులు పూర్తి వివరాల కోసం APPSC అధికారిక http://psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.






