- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీగా నాగబాబు ఏకగ్రీవం.. మరో నలుగురు కూడా..
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. జనసేన పార్టీ(Janasena Party) తరపున కొణిదెల నాగబాబు(Nagababu), తెలుగుదేశం పార్టీ నుంచి బీటీ రాయుడు, కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్లు దాఖలు చేశారు. తాజాగా.. వీరంతా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల సంఘం(Election Commission) అధికారికంగా ప్రకటించింది. గురువారం రిటర్నింగ్ అధికారి నుంచి వీరంతా ధృవీకరణ పత్రాలు అందుకున్నారు.
Read Also..
రేవంతన్న చెప్పింది అక్షరసత్యం.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
కాగా, ఈ దఫాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా, పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం(TDP) మూడు స్థానాలతో సరిపెట్టుకుంది. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు చెరో స్థానాన్ని కేటాయించింది. జనసేన తరఫున ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) సోదరుడు కొణిదెల నాగబాబును ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. మరోవైపు ఇప్పటికే నాగబాబుకు కేబినెట్‌లో చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) ప్రకటించిన విషయం తెలిసిందే.






