- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంతన్న చెప్పింది అక్షరసత్యం.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంతన్న చెప్పింది అక్షర సత్యమని, దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించకపోవడం తగదని ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంతన్న(CM Revath Reddy) చెప్పింది అక్షర సత్యమని, దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందించకపోవడం తగదని ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల (APCC President YS Sharmila) అన్నారు. కేంద్రం తీసుకొస్తున్న డీలిమిటేషన్ విధానం (Delimitation Polocy)పై దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయంగా దుమారం రేగుతోంది. దీనిపై పార్లమెంట్ లో సైతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ విధానంపై దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని తమిళనాడు సీఎం స్టాలిన్ (CM Stalin) పిలుపునిస్తున్నారు. దీనిపై షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె.. డీ లిమిటేషన్ ద్వారా సౌత్ స్టేట్స్ పై నిజంగా బీజేపీది ప్రతికారమేనని, దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రభావం లేనందుకే ఈ కక్ష్య సాధింపు చర్య అని మండిపడ్డారు.
పార్లమెంట్ లో సౌత్ ప్రాతినిథ్యం తగ్గించే కుట్రలో భాగమని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న చెప్పిన మాటలు అక్షర సత్యమని తెలిపారు. జనాభా ప్రాతిపదికన డీ లిమిటేషన్ చేయడం అంటే, కుటుంబ నియంత్రణ పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నట్లేనని స్పష్టం చేశారు. 1971 తర్వాత సౌత్ కంటే నార్త్ లోనే అత్యధిక జనాభా పెరిగిందని, ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రమునే ఉదాహరణగా తీసుకుంటే 8 కోట్ల నుంచి 24 కోట్ల జనాభా పెరిగిందని చెప్పారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం యూపీలో 80 నుంచి 143 సీట్లకు అదనంగా పెరుగుతున్నట్లేనని, బీహార్ లో 40 నుంచి 79 కి పెరిగే స్థానాలు కలుపుకుంటే రెండు రాష్ట్రాల నుంచే 222 ఎంపీలు పార్లమెంట్ లో ప్రాతినిథ్యం వహించే పరిస్థితి వస్తుందని అన్నారు.
ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం పెరిగే సీట్లు 12 మాత్రమేనని, అంటే 42 నుంచి 54కి మాత్రమే పెరుగుతాయని వివరించారు. సౌత్ రాష్ట్రాల్లో పెరిగే సీట్లు పదుల సంఖ్యలో ఉంటే, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ సంఖ్య వందలాదిగా ఉంటోందని, డీ లిమిటేషన్ పై బీజేపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సూచించారు. డీ లిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతుంటే ఏపీ సీఎం చంద్రబాబు స్పందించకపోవడం తగదని అన్నారు. దాటవేసే ధోరణి అవలభించడం అన్యాయమని, బీజేపీతో కూటమి పొత్తులో ఉన్నారని మౌనం వహిస్తే చేతులు కాలాక ఏం పట్టుకున్నా ఉపయోగం లేదని చంద్రబాబు గ్రహించాలని చెప్పారు. డీ లిమిటేషన్ పై మీ వైఖరి వెంటనే చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరుపున కాంగ్రెస్ చీఫ్ డిమాండ్ చేశారు.






