తొలి ఏడాదిలో సుపరిపాలనకు మొదటి అడుగు: మంత్రి నారా లోకేష్

by Malleboina Mahesh |   (  Updated:2025-06-12 05:47:49  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి 2024లో జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనను ముగించుకుంది.

తొలి ఏడాదిలో సుపరిపాలనకు మొదటి అడుగు: మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి 2024లో జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి ప్రభుత్వం (coalition government) సంవత్సర పాలన (Year rule)ను ముగించుకుంది. ఈ నేపథ్యంలో నేడు ఏడాది పాలనపై పోరంకిలో కూటమి ఏడాది పాలన వేడుకలు నిర్వహించనున్నారు. అలాగే సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రత్యేక కార్యక్రమం, సాయంత్రం 5 గంటలకు పోరంకిలో బహిరంగ సభ (Public meeting)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తొలి ఏడాదిలో ప్రజలకు అందించిన సుపరిపాలనపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో "ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజా పాలన ప్రారంభమై నేటికి ఏడాది! సుపరిపాలనలో తొలి అడుగు పడింది.

విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలైంది. ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో చెయ్యలేని ఎన్నో పనులు ఏడాదిలోనే పూర్తి చేశాం. అన్ని పనులు ఏడాదిలోనే పూర్తి చేశామని కాలర్ ఎగరేయడం లేదు. ఇంకా రాష్ట్ర ప్రజలకు చేయాల్సింది ఎంతో ఉంది. నిర్దేశించుకున్న లక్ష్యం కోసం ప్రతినిత్యం శ్రమిస్తాం. ప్రజాసేవలో నిమగ్నమవుతాం. సుపరిపాలనకు సహకరించిన ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికీ ధన్యవాదాలు." అని రాసుకొచ్చారు.

Read More..

Nara Lokesh: కాలర్​ ఎగరేయడం లేదు.. లోకేశ్​ ఇంట్రస్టింగ్​ కామెంట్స్​

Next Story