Nara Lokesh: కాలర్​ ఎగరేయడం లేదు.. లోకేశ్​ ఇంట్రస్టింగ్​ కామెంట్స్​

by Thanuru Gopichand |   (  Updated:2025-06-12 05:47:22  IST  )

‘అన్ని పనులు ఏడాదిలోనే పూర్తి చేశామని కాలర్ ఎగరేయడం లేదు. చెయ్యాల్సింది ఎంతో ఉంది..’ అంటూ మంత్రి నారా లోకేశ్​ ఇంట్రస్టింగ్​ కామెంట్స్​పోస్టు చేశారు.

Nara Lokesh: కాలర్​ ఎగరేయడం లేదు.. లోకేశ్​ ఇంట్రస్టింగ్​ కామెంట్స్​
X

దిశ, డైనమిక్​ బ్యూరో : ‘అన్ని పనులు ఏడాదిలోనే పూర్తి చేశామని కాలర్ ఎగరేయడం లేదు. చెయ్యాల్సింది ఎంతో ఉంది..’ అంటూ మంత్రి నారా లోకేశ్​ ఇంట్రస్టింగ్​కామెంట్స్​పోస్టు చేశారు. కూటమి ప్రభుత్వ పాలన మొదలై ఏడాదైన సందర్భంగా ఆయన ఒక ట్వీట్​చేశారు. ‘ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజా-పాలన ప్రారంభమై నేటికి ఏడాది! సుపరిపాలనలో తొలి అడుగు ప డింది. విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం మొదలైంది. ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో చెయ్యలేని ఎన్నో పనులు ఏడాదిలోనే పూర్తి చేశాం...’ అని ఆయన పేర్కొన్నారు. అన్ని పనులు ఏడాదిలోనే పూర్తి చేశామని కాలర్ ఎగరేయడం లేదు. చెయ్యాల్సింది ఎంతో ఉంది. నిర్దేశించుకున్న లక్ష్యం కోసం ప్రతినిత్యం శ్రమిస్తాం. ప్రజాసేవలో నిమగ్నమవుతాం. సుపరిపాలనకు సహకరించిన ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అంద రికీ ధన్యవాదాలు.. అని అందులో పేర్కొన్నారు.

Read More..

Chandrababu Naidu: సుపరిపాలనలో తొలి అడుగు.. మలి అడుగు మరింత సక్సెస్ ​అవ్వాలి .. చంద్రబాబు నాయుడు ట్వీట్​

Next Story