BIG BREAKING : మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-02 03:45:20  IST  )

ఇబ్రహీంపట్నం కల్తీమద్యం కేసులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ (Jogi Ramesh Arrest) చేశారు.

BIG BREAKING : మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇబ్రహీంపట్నం కల్తీమద్యం కేసులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ (Jogi Ramesh Arrest) చేశారు. కల్తీమద్యం కేసులో ఆయన పాత్ర ఉన్నట్లుగా ఏ1 జనార్ధన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నిర్థారించిన సిట్ అధికారులు.. ఆదివారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసి, పోలీస్ వ్యానులో విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. జోగి రమేష్ అరెస్ట్ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. జై జోగి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం తమపై కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోందని ఆందోళనకు దిగారు. కాగా.. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని జోగి రమేష్ వాపోయారు. మరోవైపు జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఇదే కేసులో ఆయనను కూడా అరెస్ట్ చేసి ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు.

Read More..

జోగి రమేష్ అరెస్ట్ పై వైసీపీ నేతల ఆందోళన.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని నిరసన

Next Story