- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోగి రమేష్ అరెస్ట్ పై వైసీపీ నేతల ఆందోళన.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని నిరసన
నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు ఇవాళ ఉదయం (ఆదివారం) ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్ద అరెస్ట్ చేసి.. విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) అరెస్ట్‌పై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు ఇవాళ ఉదయం (ఆదివారం) ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్ద అరెస్ట్ చేసి.. విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. తెల్లవారుజామునే మాజీ మంత్రి ఇంటి వద్ద భారీగా పోలీసులు చేరుకోవడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రిని పోలీసులు భారీ బందోబస్తు నడుమ అదుపులోకి తీసుకున్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఈ సందర్భంగా జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జోగి రమేష్ అరెస్ట్‌పై వైసీపీ నేతలు నిరసన తెలిపారు. నకిలీ మద్యం కేసులో ఆయనను ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా జోగి రమేష్ కుమారుడు రాజీవ్ మాట్లాడుతూ.. మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు, పోలీసులు ముందుస్తు నోటీసులు ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య అని, నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని సూచించారు. కాగా, ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును పోలీసులు అదుపులోకి తీసకున్నారు. అలాగే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
Read More..






