వైఎస్ వివేకా హత్యకేసులో ట్విస్ట్.. ఎర్ర గంగిరెడ్డికి సుప్రీం కోర్టు షాక్

by Disha Web Desk |
వైఎస్ వివేకా హత్యకేసులో ట్విస్ట్.. ఎర్ర గంగిరెడ్డికి సుప్రీం కోర్టు షాక్
X

దిశ,డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ 1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. జూలై 1న గంగిరెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వివరాల్లోకి వెళ్తే వైఎస్ వివేకా హత్యకేసులో గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. అయితే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో గత నెల 27న బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30లోగా దర్యాప్తును పూర్తి చేయాలని.. జూలై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు శుక్రవారం జూలై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపోతే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 14న తన నివాసంలో హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో ఏ 1 నిందితుడిగా ఎర్ర గంగిరెడ్డి ఉన్నారు. ఈ హత్యకేసును సిట్ విచారిస్తుండగా సకాలంలో చార్జీషీట్ దాఖలు చేయలేదు. దీంతో ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ మంజూరైంది.

ఇవి కూడా చదవండి:

వివేకా హత్య విషయం సీఎం జగన్‌కు ముందే తెలుసు.. సీబీఐ విచారణపై లాయర్లు మండిపాటు

Viveka Case: వైఎస్ సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం.. సీరియస్ వార్నింగ్

Viveka Case: వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు


Next Story

Most Viewed