వివేకా హత్య విషయం సీఎం జగన్‌కు ముందే తెలుసు.. సీబీఐ విచారణపై లాయర్లు మండిపాటు

by Disha Web Desk 7 |
వివేకా హత్య విషయం సీఎం జగన్‌కు ముందే తెలుసు.. సీబీఐ విచారణపై లాయర్లు మండిపాటు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఏ1 నిందుతుడిగా ఎర్ర గంగిరెడ్డి ఉన్నాడు. ఇక తాజాగా మరో సంచలన న్యూస్ బయటకు వచ్చింది. వైఎస్ వివేకా హత్య విషయం సీఎం జగన్‌కు ముందే తెలుసని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. దీనిపై సీఎం తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సీబీఐ అఫిడవిట్ వెనుక కుట్ర కోణం ఉందని భావిస్తున్న జగన్ న్యాయవాదులు.. దీనిపై న్యాయపర చర్యలకు సిద్ధం అవుతున్నారు. కాగా.. వివేకా మృతి విషయం జగన్‌కు ఉదయం 6.15 కు ముందే తెలిసినట్లు సీబీఐ విచారణలో తేలింది. వివేకా పీఏ కృష్ణారెడ్డి చెప్పకముందే జగన్‌కు విషయం తెలుసని సీబీఐ అనుబంధ కౌంటర్‌లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

అవినాశ్‌రెడ్డిని దోషిగా చిత్రీకరిస్తున్నారు.. అన్యాయం: K.A. Paul

వైఎస్ వివేకా హత్యకేసులో ట్విస్ట్.. ఎర్ర గంగిరెడ్డికి సుప్రీం కోర్టు షాక్



Next Story

Most Viewed