- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏ దేవాలయానికి వెళ్లినా మాపై ట్రోలింగ్ చేస్తున్నారు !
బెజవాడ దుర్గమ్మను దువ్వాడ శ్రీనివాస్, మాధురి దర్శించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: బెజవాడ దుర్గమ్మను దువ్వాడ శ్రీనివాస్, మాధురి దర్శించుకున్నారు. బుధవారం సాయంత్రం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తీర్థ, ప్రసాదాలు తీసుకుని..హైదరాబాద్ వెళ్లారు. అయితే దర్శనం అనంతరం మీడియాతో దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా విజయవాడ కనక దుర్గమ్మను ఇంటి దైవంగా భావిస్తున్నామని.. తాము కోరిన కోర్కెలను ఆమె తీర్చుతున్నారని వెల్లడించారు. గతంలో మొక్కు ఉండగా..తాజాగా కానుకలు సమర్పించి, మొక్కు తీర్చుకున్నట్లు వివరించారు.
అయితే ఏ దేవాలయానికి వెళ్లినా తమ జంటపై అనేక రకాల ట్రోలింగ్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు అలా వ్యవహరిస్తున్నారని... వాళ్లందరికీ అతి త్వరలోనే తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా, బెజవాడ దుర్గమ్మకు తాజాగా బంగారు ఆభరణం కానుకగా వచ్చింది. నిజామాబాద్ లోని ద్వారకా నగర్ కు చెందిన భక్తుడు తడుపునూరి శ్రీనివాస్ కూడా బంగారు ఆభరణం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆభరణం ధర 17 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. క్లిక్
అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా పదుకొణె ఔట్.. మరో హీరోయిన్‌ను తీసుకోవడంపై క్లారిటీ ఇచ్చిన టీమ్






