Tirumala News: శ్రీవారిని దర్శించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-05 05:41:11  IST  )

తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు.

Tirumala News: శ్రీవారిని దర్శించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో భక్తి శ్రద్దలతో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ తరుణంలో తాజాగా ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Director Nag Ashwin), ప్రియాంక దత్(Priyanka) దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్నారు. ఈ క్రమంలో వారికి టీటీడీ(TTD) అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. ఇవాళ(శనివారం) వేకువజామున కుటుంబ సభ్యులతో శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి వెళ్తుండగా డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను చూసిన అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అంతేకాదు రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్-2 అప్డేట్ గురించి అడిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ(Tollywood Industry) బాగుండాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నాను. ఇక ‘కల్కి 2898 ఏడీ’ గురించి చెబుతూ.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలిపారు.

Read More..

బావా యాక్టర్ అవుతా అన్నాడు.. నా సపోర్ట్ నీకు ఉండదు పోయి సావు అని చెప్పేశా.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

Pooja Hegde: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బుట్టబొమ్మ.. వైరలవుతోన్న ఫొటోలు

Next Story