Pooja Hegde: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బుట్టబొమ్మ.. వైరలవుతోన్న ఫొటోలు

by Kodari Anjali |

టాలీవుడ్ ముద్దుగుమ్మ నటి పూజా హెగ్డే (Pooja Hegde) తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

Pooja Hegde: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బుట్టబొమ్మ.. వైరలవుతోన్న ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ముద్దుగుమ్మ నటి పూజా హెగ్డే (Pooja Hegde) తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. నేడు (ఏప్రిల్ 4) తెల్లవారి జామున శ్రీవారి సుప్రభాత సేవలో పూజా పాల్గొంది. ఈ నటికి తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) అధికారులు స్వాగతం పలికి.. దగ్గరుండి మరీ దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక శ్రీవారి దర్శనం అనంతరం హీరోయిన్ పూజా హెగ్డేకు తితిదే అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే రీసెంట్‌గానే ఈ బుట్టబొమ్మ తిరుపతిలోని శ్రీకాళహస్తీశ్వర దేవాలయాన్ని (Srikalahastheeswara Temple) దర్శించుకున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి ఈ బ్యూటీ ఆలయానికి వెళ్లింది. అక్కడ కుటుంబ సభ్యులంతా కలిసి రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు (Rahu ketu sarpa doṣa nivaraṇa) చేయించుకున్నారు. తర్వాత శ్రీ వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్జాన ప్రసూనాంబిక దేవి (Sri Vayu Lingeswara Swamy and Sri Jjana Prasunambika Devi)ని దర్శించుకున్నారు. ఇక పండితులు, ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను పూజా హెగ్డే, తన ఫ్యామిలీకి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Next Story