- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ద్రోణి ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు
పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దాని నుంచి ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రంలో మంగళవారం మేఘావృత వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది....

దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దాని నుంచి ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రంలో మంగళవారం మేఘావృత వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం..
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మిగతా జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనకాపల్లి జిల్లాలో అత్యధిక వర్షపాతం
సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రంలో అత్యధికంగా అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 66.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెంజెరువులో 42.5 మి.మీ, సోమలింగపాలెంలో 40 మి.మీ, మన్యం జిల్లా పాలకొండలో 36 మి.మీ, విశాఖ జిల్లా కనమంలో 35 మి.మీ, అనకాపల్లి జిల్లా రాంబిల్లి, రామరాయుడిపాలెంలో చెరో 33.7 మి.మీ, విజయనగరంలో 32.5 మి.మీ, శ్రీకాకుళం జిల్లా లావేరులో 29 మి.మీ వర్షపాతం నమోదైంది.






