ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌పై పోలీసులకు విద్యార్థుల ఫిర్యాదు

by Kodari Anjali |

ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు.

ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌పై పోలీసులకు విద్యార్థుల ఫిర్యాదు
X

దిశ, జగిత్యాల టౌన్: ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ఒకేషనల్ విద్యార్థుల తరగతి గదులను ప్రిన్సిపాల్ జనరల్ గ్రూపు విద్యార్థులకు కేటాయించడంపై విద్యార్థులు నిరసన చేపట్టారు. తమకు కేటాయించిన తరగతి గదులను కొత్తగా చేరిన జనరల్ విద్యార్థులకు ఇవ్వడంతో పాటు, శిథిలావస్థలో ఉన్న గదులను తమకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ కళాశాల ఆవరణలో ధర్నా నిర్వహించారు. తమ తరగతి గదులను తమకే కేటాయించాలని ప్రిన్సిపాల్‌ను కోరగా, ఆయన తమతో దుర్భాషలాడారని విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయంపై జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విద్యార్థులు, కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో కళాశాలలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

Next Story