- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మతం మారిన ధనుంజయ.. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పోస్ట్
ఇటీవల మతం మార్చుకున్న ఓ యువకుడు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా నల్లచెరువు మండలంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల మతం మార్చుకున్న ఓ యువకుడు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా నల్లచెరువు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దేవిరెడ్డి పల్లి కి చెందిన ధనుంజయ అనే వ్యక్తి ఇటీవల తన మతం మార్చుకొని ఇస్లాం లోకి వెళ్లి.. తన పేరును షేక్ మహ్మద్ ఆసిఫ్ గా మార్చుకున్నాడు. ఇంత వరకు అంతా బానే ఉన్నా.. ఏమైందో ఏమో గాని ఎవరూ ఊహించని విధంగా పాకిస్తాన్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు ఆ యువకుడు.
దీంతో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియో పోస్ట్ చేసిన ధనుంజయ అలియాస్ షేక్ మహమ్మద్ ఆసిఫ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నల్లచెరువు పోలీస్ స్టేషన్‌లో కొందరు యువకులు ఫిర్యాదు చేశారు. కాగా ప్రస్తుతం ధనుంజయ(షేక్ మహ్మద్ ఆసిఫ్)కు పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆ యువకుడిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది.
SI భానుప్రకాశ్ రెడ్డిపై రెండు కేసులు నమోదు.. అదుపులోకి తీసుకున్న ఈస్ట్ జోన్ పోలీసులు






