- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SI భానుప్రకాశ్ రెడ్డిపై రెండు కేసులు నమోదు.. అదుపులోకి తీసుకున్న ఈస్ట్ జోన్ పోలీసులు
బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని.. ఓ కేసులో రికవరీ బంగారం తాకట్టు పెట్టి, రివాల్వర్ సైతం పోగొట్టిన ఘటనలో ఎస్సై భానుప్రకాశ్ (Bhanu Prakash)పై తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని.. ఓ కేసులో రికవరీ బంగారం తాకట్టు పెట్టి, రివాల్వర్ సైతం పోగొట్టిన ఘటనలో ఎస్సై భానుప్రకాశ్ (Bhanu Prakash)పై తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఇవాళ అతడిని ఈస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2020 బ్యాచ్‌కు చెందిన ఎస్సై భానుప్రకాష్ హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొన్ని ఠాణాల్లో విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం అంబర్‌పేట్ పీఎస్ క్రైం ఎస్సైగా పని చేస్తున్నాడు.
కాగా, ఇటీవలే పీఎస్‌లో నమోదైన 4 తులాల బంగారం చోరీ కేసులో తానే ఎంక్వైరీ చేస్తూ బంగారాన్ని రికవరీ చేశాడు. కానీ, ఆ గోల్డ్‌ను బాధితులకు ఇవ్వకుండా బాధితులకు మాయమాటలు చెప్పి లోక్ అదాలత్‌లో కేసును క్లోజ్ చేయించాడు. ఆ తర్వాత కూడా ఫిర్యాదుదారులకు బంగారాన్ని హ్యాండోవర్ చేయకండా భానుప్రకాష్ దానిని బయట తాకట్టు పెట్టాడు. అదేవిధంగా తన సర్వీసు రివాల్వర్ కూడా డబ్బుల కోసం రాయలసీలోని ఓ ముఠాలకు అమ్మేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, విషయం కాస్త ఉన్నతాధికారులకు తెలియడంతో ఎస్సై భానుప్రకాశ్‌పై ప్రాథమిక విచారణ చేపట్టి రిపోర్టును రెడీ చేశారు. ఈ మేరకు తాజాగా అతడిపై మొత్తం రెండు కేసులను నమోదు చేయడం పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.






