- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్.. 1937 ఎకరాల సమీకరణ
రాజధాని విస్తరణలో భాగంగా అమరావతిలో సీఆర్డీఏ అధికారులు రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపడుతున్నారు..

దిశ, వెబ్ డెస్క్: రాజధాని విస్తరణలో భాగంగా అమరావతిలో సీఆర్డీఏ అధికారులు రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపడుతున్నారు. ప్రస్తుతం వడ్డమాను, యండ్రాయి గ్రామాల్లో భూమిని సేకరిస్తున్నారు. వడ్డమాను గ్రామంలో మొత్తం 1937 ఎకరాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. భూ సమీకరణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే భూసేకరణ వల్ల వచ్చే ప్రయోజనాలూ వివరిస్తున్నారు. ఇక రెండో దశలో 3,828.56 ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పటికే అందుబాటులో ఉంది.
వడ్డమానులో రెండో విడత భూసమీకరణ
అయినా ఇంకా కొన్ని భూములు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభించింది. తుళ్లూరు మండలం పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం, అమరావతి మండలం వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి లేమల్లె గ్రామాల్లో భూసమీకరణ జరుగుతోంది. రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం 7 గ్రామాల్లో భూమిని సమీకరిస్తున్నారు. ఈ రోజు ఉదయం10 గంటలకు రెండో విడుత భూసమీకరణ వడ్డమానులో మంత్రి నారాయణ ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు ఎండ్రాయిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభించనున్నారు.
Read More..






