ల్యాండ్ పూలింగ్‌లో ఉద్రిక్తత.. రాజధానిని చట్టబద్ధత చేయాలని డిమాండ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-07 06:13:44  IST  )

ఏపీ రాజధాని అమరావతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

ల్యాండ్ పూలింగ్‌లో ఉద్రిక్తత.. రాజధానిని చట్టబద్ధత చేయాలని డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amaravati)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధాని(Rajadhani) విస్తరణలో భాగంగా వడ్డమాను(Vaddamanu) గ్రామంలో సీఆర్డీఏ(CRDA) అధికారులు ల్యాండ్ పూలింగ్(Land Pooling) కొనసాగుతోంది. ఈ మేరకు వడ్డమాను గ్రామంలో సభ నిర్వహించారు. మంత్రి నారాయణ(Minister Narayana) ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్‌పై అవగాహన కల్పించి రైతులు నుంచి భూమిని సమీకరిస్తున్నారు. అయితే రైతులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. అమరావతి చట్టబద్ధతపై అధికారులను నిలదీస్తున్నారు. ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిని కేంద్రం నోటిఫై చేసేందుకు ప్రయత్నిసోందని రైతులకు మంత్రి నారాయణ వివరించారు. రాజధాని మార్పు అనేదే ఉత్పన్నం కాదని భరోసా కల్పించారు. ఇక రైతులకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. కుటుంబానికి లక్షా 50 వేల వరకూ రుణమాఫీ చేస్తామని రైతులకు మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.

ఎకరాకు రూ. 5 లక్షలు ఇవ్వాలని రైతుల డిమాండ్

అయితే మూడేళ్లలో తమ భూములు అభివృద్ధి చేయలేకపోతే ఎకరాకు రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని రైతులు అంటున్నారు. మరోవైపు మొదటి విడత అభివృద్ధి ఎంత వరకు జరిగిందని ప్రశ్నించారు. అమరావతిలో ఏ రకమైన అభివృద్ధి జరిగిందని నిలదీశారు. ల్యాండ్ పూలింగ్ ప్రయోజనాలకు రైతులకు వివరిస్తూ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో సీఆర్డీఏ అధికారులు భూమిని సేకరిస్తున్నారు.

Read More..

అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్.. 1937 ఎకరాల సమీకరణ

Next Story