రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ.. రైతులు, నిరుద్యోగుల ప్రస్తావనే లేదు : సీపీఎం యద్దేవా

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-15 12:14:43  IST  )

కూటమి ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్లో అంకెల గారడీ తప్ప మరేం కనిపించడం లేదని సీపీఎం యద్దేవా చేసింది. బడ్జెట్ కు నిరసనగా విజయవాడలో ఆందోళన వ్యక్తం చేసింది.

రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ.. రైతులు, నిరుద్యోగుల ప్రస్తావనే లేదు : సీపీఎం యద్దేవా
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు సర్కార్ రూపొందించిన బడ్జెట్ దృశ్యం సినిమాను తలపించేలా ఉందని రాష్ట్ర సీపీఎం పార్టీ నేతలు యద్దేవా చేశారు. కూటమి బడ్జెట్ కు వ్యతిరేకంగా ఆదివారం విజయవాడలో సీపీఎం నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి పెద్దమొత్తంలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారని, బడ్జెట్ ఇందుకు విరుద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 25 శాతం పెట్టుబడులు రాష్ట్రానికే వచ్చాయని చెప్తున్నారన్నారు. కోతలమీద వాతలు పెట్టినట్లుగా బడ్జెట్ ఉందని మండిపడ్డారు. రాష్ట్రానికి రావలసిన ఆదాయం తగ్గిపోతోందని, అభివృద్ధి జరగలేదని అంకెల లెక్కలే చెప్తున్నాయన్నారు. బడ్జెట్లో అంకెల గారడీ తప్ప ఇంకేం కనిపించలేదన్నారు. గడిచిన రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించారు. కౌలు రైతులు, నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదన్నారు. అమృత్ నిధులు, స్మార్ట్ నిధులు ఎటు వెళ్తున్నాయో ఎవ్వరికీ అర్థం కావట్లేదన్నారు. విజయవాడలో ఎటుచూసినా మురికి వీధులు, దోమల గుంపులే కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ అధ్యక్షుడు మాధవ్ నోట.. బడ్జెట్ మాట

Next Story