ఎస్పీ క్లీన్ చిట్ ఇచ్చినా ఎంపీ గోరంట్ల మాధవ్‌కు తప్పని తిప్పలు..

by Dishanational4 |
ఎస్పీ క్లీన్ చిట్ ఇచ్చినా ఎంపీ గోరంట్ల మాధవ్‌కు తప్పని తిప్పలు..
X

దిశ, ఏపీ బ్యూరో : అనంతపురం ఎస్పీ ఫకీరప్ప హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఓరిజినల్ కాదని క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ వివాదం ఆగడం లేదు. ఓ మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్నట్లుగా ఉన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియోపై గురువారం కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ ప్రధాని న‌రేంద్ర మోడీ, లోక్ స‌భ స్పీకర్ ఓం బిర్లా, జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్సన్‌ల‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో వ్యవ‌హారం పార్లమెంటు స‌భ్యుల‌కు మాయ‌ని మ‌చ్చగా ఉంద‌ని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వీడియోపై తక్షణమే విచారణ చేపట్టి ఎంపీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ వీడియోలో నిజ నిజాలు నిర్ధారించి నిజమని తేలితే ఎంపీపై కఠిన చర్యలు తీసుకుని పార్లమెంట్ సభ్యుల గౌరవాన్ని కాపాడాలని ఎంపీ జస్పీర్ సింగ్ గిల్ ప్రధాని మోడీ, స్పీక‌ర్‌ ఓం బిర్లా, జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్సన్‌ల‌కు ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ విజ్ఞప్తి చేశారు.

వారిని దూషించినందుకు ఎంపీ గోరంట్ల మాధవ్‌కు పిండ ప్రధానం..



Next Story

Most Viewed