- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారిని దూషించినందుకు ఎంపీ గోరంట్ల మాధవ్‌కు పిండ ప్రధానం..
దిశ, ఏపీ బ్యూరో : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.Latest Telugu News

దిశ, ఏపీ బ్యూరో : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. వీడియోపై విచారణ జరిపించాలని అటు స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్రమోడీలకు సైతం ఫిర్యాదులు అందాయి. ఏపీలో అనంతపురం ఎస్పీ ఫకీరప్ప అది ఒరిజినల్ వీడియో కాదని వెల్లడించినప్పటికీ నిన్నొదలా అన్నట్లుగా మిగిలిన నేతలు వదలడం లేదు. తాజాగా గోరంట్ల మాధవ్‌కిరాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ నాయకులు కే శివశర్మ గండూరి మహేష్‌లు గురువారం పిండప్రదానం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై వ్యక్తిగతంగా అసభ్యకర పదజాలంతో దూషించిన మాధవ్‌కు ఇక రోజులు చెల్లిపోయాయని అందుకే పిండప్రదానం నిర్వహించామని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ నాయకులు శివ శర్మ గండూరి మహేష్ తెలిపారు.తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు సురభి బాలు ఎంపీ గోరంట్ల మాధవ్‌కు పిండ ప్రదానం చేసి పిండాలను కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోనుగుపాటి వెంకట సుబ్బయ్య, తక్కెళ్ళ కేశవ్, చింతకాయల శ్రీనివాస్, తెలుగు యువత నాయకులు బబ్బురి శ్రీనివాస్, కుప్పిలి నాగబాబు తదితరులు పాల్గొన్నారు.






