- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం ఆదేశం.. టీడీపీ నేతలపై కేసులు నమోదు
ప్రజల భద్రత, రాష్ట్ర ప్రశాంతతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని సీఎం కుండ బద్ధలుగొట్టారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) శాంతిభద్రతల పరిరక్షణ కోసం స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీలతో సంబంధం లేకుండా నిందితులపై కేసు నమోదు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) ఇంటి వద్ద జరిగిన దాడి ఘటనపై ఆరా తీసిన సీఎం, చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మైలవరం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ (TDP) నేతలపై పోలీసులు కేసులు (Police Case) నమోదు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. రాజకీయ పార్టీలు ఎల్లప్పుడూ రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య విలువలకు లోబడి వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నాయుడు హితవు పలికారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారితీసే ఎలాంటి చర్యలనైనా సహించే ప్రసక్తే లేదన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడబోమని తేల్చి చెప్పారు. చట్టం ఎవరికైనా ఒక్కటేనని, తప్పు చేసిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. ప్రజల భద్రత, రాష్ట్ర ప్రశాంతతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని కుండ బద్ధలుగొట్టారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా హెచ్చరించారు.






