- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదంతా ట్రాప్.. జాగ్రత్తగా ఉండండి : నేతలకు సీఎం కీలక సూచనలు
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలై.. అధికారాన్ని కోల్పోవడాన్ని వైఎస్సార్సీపీ నేటికీ జీర్ణించుకోలేకపోతోందని, ఆ అక్కసుతోనే రాష్ట్రంలో అలజడులు సృష్టించే కుట్రలు పన్నుతోందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలై.. అధికారాన్ని కోల్పోవడాన్ని వైఎస్సార్సీపీ నేటికీ జీర్ణించుకోలేకపోతోందని, ఆ అక్కసుతోనే రాష్ట్రంలో అలజడులు సృష్టించే కుట్రలు పన్నుతోందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. టీడీపీ నేతలెవ్వరూ ఆ ట్రాప్ లో పడొద్దని సూచించారు. సోమవారం పార్టీ ముఖ్యనేతలు, సీనియర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని, మనల్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని తెలిపారు. వాళ్లు చేసిన పాపాలను దారిమళ్లించేందుకు కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. వారి ట్రాప్ లో పడకుండా టీడీపీ నాయకులంతా జాగ్రత్తలు తీసుకోవాలని, కార్యకర్తలు సంయమనం పాటించేలా మంత్రులు, నేతలు బాధ్యత వహించాలని సూచించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రధాన అజెండా అని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీ నేతలకు నచ్చడం లేదని, అందుకే అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతామన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలెవరూ ఆవేశంతో చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని సీఎం కోరారు. హింస, విధ్వంసం, అవినీతి అనే పునాదులతో పుట్టిన వైసీపీ ట్రాప్ లో పడితే.. వాళ్లకు మనకూ తేడా ఏం ఉండదని హితవు పలికారు.






