- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్, లోకేష్, బాలకృష్ణలకు పోటీగా మహిళలను దింపిన జగన్
వైసీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశాలు నెలకొన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు ప్రముఖులకు పోటీకి సీఎం జగన్ వ్యూహాత్మకంగా మహిళలను దింపారు.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశాలు నెలకొన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు ప్రముఖులకు పోటీకి సీఎం జగన్ వ్యూహాత్మకంగా మహిళలను దింపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక నారా లోకేశ్(మంగళగిరి)కు పోటీగా లావణ్య, బాలకృష్ణ (హిందూపురం)కు TN దీపిక పోటీలో పెట్టారు. మొత్తం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్యేల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఎంపీల జాబితాను ఎంపీ నందిగం సురేశ్ వెల్లడించారు. ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మొత్తం 19 మహిళలు ఉండటం చర్చనీయాంశంగా మారింది.
Read More : YSRCP Candidates : తుది జాబితా.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు
Read More : ఏపీ ఎన్నికల బరిలో రేర్ సీన్.. ఐదుగురు మాజీ CMల కుమారులు పోటీ






