- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నా జీవితం తెలుగు ప్రజలకు అంకితం’.. CM చంద్రబాబు భావోద్వేగ ప్రకటన
తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) మరోసారి ఎన్నికయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) మరోసారి ఎన్నికయ్యారు. టీడీపీ నాయకులంతా ఆయన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 30 ఏళ్ల నుంచి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. 1995లో తొలిసారి పగ్గాలు చేపట్టిన ఆయన.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నారు. తాజాగా మరోసారి ఎన్నికవడంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా భావోద్వేగ ప్రకటన చేశారు.
‘టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా నన్ను మళ్లీ ఎన్నుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు సవినయంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజాస్వామ్యయుతంగా సంస్థాగత ఎన్నికలు జరుపుకోవడం పార్టీ ఆనవాయితీ. అదే ప్రకారం కడప మహానాడులో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. నా పేరు ప్రతిపాదించిన, సమర్థించిన, ఆమోదించిన వారందరికీ కృతజ్ఞతలు. మీరు నాపై ఉంచిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానను. ‘కార్యకర్తే అధినేత’ అనే సూత్రానికి అనుగుణంగా పని చేస్తాను. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో NDA కూటమి ఘన విజయం సాధించింది. ఆ విజయం మన బాధ్యతను పెంచింది. గాడితప్పిన రాష్ట్రాన్ని ఇప్పటికే చాలా రంగాల్లో సరిదిద్దాం. పేద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు తీసుకువెళుతున్నాం.
పెట్టుబడుల కోలాహలంతో, పరుగులు పెడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులతో, భవిష్యత్తును అందంగా చూపించే మౌలికసదుపాయాల కల్పనతో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాష్ట్రం ముందడుగు వేస్తున్నది. సంక్షేమాన్ని పంచిపెడదాం.. అభివృద్ధిలో భాగస్వాములమౌదాం.. భావితరాలకు మార్గదర్శులమౌదాం.. ప్రపంచ దేశాల్లో తెలుగువారి సత్తాను చూపే దిశగా పయనిద్దాం. నా జీవితం తెలుగు ప్రజల సేవకే అంకితం. మరోసారి ఈ అద్భుత అవకాశాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read..
దిశ’ మహానాడు సంచిక చాలా బాగుంది.. CM చంద్రబాబు ప్రశంస
CM చంద్రబాబు చేతిలో ‘దిశ’ ప్రత్యేక సంచిక






