మీలో ఎలాంటి మార్పు రాలేదు.. మంత్రులపై సీఎం చంద్రబాబు అసహనం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-10 09:29:32  IST  )

సచివాలయంలో మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

మీలో ఎలాంటి మార్పు రాలేదు.. మంత్రులపై సీఎం చంద్రబాబు అసహనం
X

దిశ‌, వెబ్ డెస్క్: సచివాలయంలో మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సమావేశంలో మంత్రుల పనితీరును సీఎం ప్రస్థావించినట్టు సమాచారం. ఈ సందర్భంగా మీలో ఎలాంటి మార్పు రాలేదంటూ అసహనం వ్యక్తం చేశారట. 18 నెలలు అయినా చాలా మంది మంత్రుల పనితీరులో మార్పు రాలేదని చంద్రబాబు అన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల నిధులు తీసుకురావడంలో మంత్రులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

అంతే కాకుండా ఢిల్లీకి అధికారులతో కలిసి వెళ్తే సంబంధిత పథకాలకి కేంద్ర నిధులు వస్తాయని, మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో నష్టమేమి లేదని చెప్పినట్టు తెలుస్తోంది. ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలని సూచించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. రాష్ట్రం విడిపోయి ప‌దేళ్లు అయినా రాజ‌ధాని నిర్మాణం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ముఖ్యంగా అమ‌రావ‌తి నిర్మాణంపై ఫోక‌స్ పెట్టింది. దీంతో సీఎం చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేల‌తో స‌మావేశం అవుతూ రివ్యూలు నిర్వ‌హిస్తున్నారు. ప‌నుల అల‌స‌త్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

READ MORE .....

ఏ దేశం వెళ్లిన అత్యధిక తలసారి ఆదాయం సంపాదించేది తెలుగువారే : సీఎం

Next Story