- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతిని ఇక ఎవరూ టచ్ చేయలేరు: చంద్రబాబు
తెలుగు జాతి ఎదుర్కొన్న చారిత్రక సవాళ్లపై అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: తెలుగు జాతి ఎదుర్కొన్న చారిత్రక సవాళ్లపై అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. దశాబ్దాలుగా రాజధానులను కోల్పోవడం వల్ల కలిగిన విమర్శలు, వివక్షత, అవమానాలను తెలుగు ప్రజలు భరిస్తూనే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏ రోజు జరుపుకోవాలో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తాను సమన్యాయం కోరితే నాటి పార్లమెంటు సభ్యులుగా ఉన్న ఇప్పటి వైసీపీ నాయకులు బాధ్యత నుంచి తప్పించుకున్నారని చంద్రబాబు విమర్శించారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని 'అభివృద్ధి వికేంద్రీకరణ' నినాదంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్తులో హైదరాబాద్, అమరావతి నగరాలు దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో నిలవాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. అమరావతిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో, భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకే చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానం చేశామని ఈ సందర్భంగా ఆయన వివరించారు.






