అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-28 15:05:20  IST  )

భవిష్యత్తులో అమరావతికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే చట్టబద్ధత కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ...

అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భవిష్యత్తులో అమరావతి(Amaravati)కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే చట్టబద్ధత కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానంపై రాష్ట్ర అసెంబ్లీ(Assembly)లో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. అమరావతి నుంచే శాతవాహనులు(Satavahanulu) పాలించారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రజా రాజధాని అమరావతి అని కొనియాడారు. బ్రిటీష్(British) వారి మ్యూజియంలో ఇప్పటికీ అమరావతి గ్యాలరీ ఉందని స్పష్టం చేశారు. శాతవాహనుల కాలంనాటి అమరావతి విశేషాలను గ్యాలరీలో భద్రపర్చారని పేర్కొన్నారు. శాతవాహనుల కాలం తర్వాత తెలుగు వాళ్లు మనుగడను కోల్పోయారని, అప్పటి నుంచి మదరాసీలు అని పిలిచారని చంద్రబాబు గుర్తు చేశారు.

పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగం వల్లే..

ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు(Potti Sriramulu) ప్రాణత్యాగం చేశారని, అందువల్లే ఆంధ్ర(Andhra) రాష్ట్రం ఏర్పడిందన్నారు. పొట్టి శ్రీరాముల వల్లే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. అప్పుడే విజయవాడ రాజధాని అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. టీడీపీ(Tdp) ఆవిర్భావంతోనే మదరాసీ(Madarasi) అనే ముద్రపోయిందని చెప్పారు. ఒక ప్రాంతీయ పార్టీ ఫ్రంట్ పేరుతో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

అమరావతిని ఇక ఎవరూ టచ్ చేయలేరు: చంద్రబాబు

Next Story