లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగిస్తే తాట తీస్తా : సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-06 10:43:38  IST  )

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు ఎవరైనా భంగం కలిగిస్తే తాట తీస్తానని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగిస్తే తాట తీస్తా : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు ఎవరైనా భంగం కలిగిస్తే తాట తీస్తానని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో నిర్వహించిన మీ భూమి - మీ హక్కు కార్యక్రమానికి హాజరైన సీఎం.. తొలుత అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగాలే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామని తెలిపారు. రైతుల భూముల పుస్తకాలపై గత ప్రభుత్వ నేతల ఫొటోలు పెట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది శాడిజానికి నిదర్శనమని విమర్శించారు. రైతుల భూములపై గత సీఎం, ఆయన తండ్రి ఫొటోలు పెట్టుకునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. స్కూల్ కు వెళ్లినా, పొలానికి వెళ్లినా వారి ఫొటోలే కనిపించేవని, వారసత్వంగా వచ్చిన భూమిపై వాళ్ల ఫొటోలు వేసుకోవడమేమిటని ఫైరయ్యారు.

ట్యాంపర్ చేస్తే పీడీ యాక్ట్

కూటమి ప్రభుత్వంలో రైతుల భూములపై ఎవరూ కన్నేయకుండా సర్వహక్కులూ కల్పించామని, రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇకపై క్యూ ఆర్ కోడ్ తో భూమికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవచ్చని, ఎవరిపేరుమీదైనా మారిస్తే.. ఆ వివరాలు కూడా వెంటనే తెలుస్తాయన్నారు. రైతులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాల రికార్డులన్నీ కంప్యూటర్ లో సేవ్ అయి ఉంటాయని, వీటిని ఎవరూ ట్యాంపర్ చేయలేరని, ఒక వేళ ట్యాంపర్ చేస్తే ఎవ్వరినీ వదిలిపెట్టబోమన్నారు. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. భూ సమస్యలు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రతినెలా 9వ తేదీన జిల్లాకు వస్తానన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో మార్పులన్నీ రైతుల అనుమతితోనే జరుగుతుందన్నారు. లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

2027 జూన్ లోపు పోలవరాన్ని పూర్తిచేస్తాం

వేదావతి పూర్తయితే హంద్రీనీవా నీటితో కరవు ప్రాంతానికి నీళ్లొస్తాయని, అందుకోసం కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. తుంగభద్ర నుంచి వచ్చే నీటిని కర్నూల్ జిల్లా ఉపయోగించుకోగలిగితే జిల్లాలో నీటి కరవు ఉండదన్నారు.

గత ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసిందని విమర్శించారు. గోదావరి పుష్కరాల్లోపు అంటే.. 2027 జూన్ లోపే పోలవరాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు. నందుల అనుసంధానం జరిగి రాయలసీమకు నీళ్లు తీసుకొచ్చి.. రతనాల సీమగా మారుస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే మూడేళ్లలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పనులను పూర్తిచేస్తామన్నారు.

బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్‌తో తిరుమల లడ్డు : సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Next Story