- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్‌తో తిరుమల లడ్డు : సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
గత ప్రభుత్వం కల్తీ నెయ్యితో ప్రసాదాలను తయారు చేయించి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: గత ప్రభుత్వం కల్తీ నెయ్యితో ప్రసాదాలను తయారు చేయించి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో నిర్వహించిన మీ భూమి - మీ హక్కు కార్యక్రమానికి హాజరైన సీఎం ఆలయ ప్రసాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్‌తో నెయ్యిని తయారు చేసి, దానితో తిరుమలలో లడ్డూలను తయారు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. NDDB నివేదిక ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో కల్తీ నెయ్యితోనే ప్రసాదాలను పంచారని సీఎం తెలిపారు. శ్రీశైలం క్షేత్రంలోనూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యినే వాడారని ఆరోపించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సీబీఐ, సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, వాళ్లు చెప్పేవన్నీ అబద్ధాలని చంద్రబాబు పేర్కొన్నారు. సిట్ ఇచ్చిన రిపోర్టులో కల్తీ జరిగినట్లుగా ఉందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారన్నారు. కల్తీలతో వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేసే స్థాయికి దిగజారారని సీఎం అసహనం వ్యక్తం చేశారు.






