ప్రధాని మోడీ బాటలో సీఎం చంద్రబాబు.. కాన్వాయ్ భారీగా తగ్గింపు!

by Malleboina Mahesh |   (  Updated:2026-05-14 10:46:07  IST  )

ప్రధాని మోడీ పిలుపుతో పొదుపు బాటలో సీఎం చంద్రబాబు నాయుడు. తన కాన్వాయ్‌ను 4 వాహనాలకు కుదిస్తూ, భద్రతా సిబ్బందికి ప్రత్యేక బస్సు ఏర్పాటు.

ప్రధాని మోడీ బాటలో సీఎం చంద్రబాబు.. కాన్వాయ్ భారీగా తగ్గింపు!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధాని మోడీ దేశ ప్రజలకు 10 పొదుపు సూత్రాలను పాటించాలని సూచించారు. ఈ క్రమంలో ప్రధాని తన కాన్వాయ్ లోని వాహనాలను కుదించి కేవలం రెండు వాహనాల్లో మాత్రమే ప్రయాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతో ప్రధాని మోడీ బాటలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నారు. ప్రధాని పిలుపును అందుకుంటూ సీఎం తన కాన్వాయ్‌ను గణనీయంగా కుదించాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటనల్లో భారీ వాహనశ్రేణి ఉండటం పరిపాటి, కానీ బాబు తన కాన్వాయ్‌ను కేవలం 4 వాహనాలకు పరిమితం చేస్తూ సచివాలయానికి చేరుకున్నారు. ప్రజా ధనాన్ని ఆదా చేయడం తో పాటు సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ చూపిస్తున్న బాటలో నడుస్తూ చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఒక బస్సును ఏర్పాటు చేయడం ఈ మార్పులో ప్రధానాంశంగా నిలిచింది. గతంలో భద్రతా సిబ్బంది వివిధ వాహనాల్లో అనుసరించేవారు. ఇప్పుడు వారందరినీ ఒకే బస్సులో ఉంచడం ద్వారా వాహనాల సంఖ్యను తగ్గించారు. కేవలం ముఖ్యమంత్రే కాకుండా, రాష్ట్ర మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లను తగ్గించుకోవాలని నిర్ణయించడం గమనార్హం. విలాసాలకు స్వస్తి చెప్పి, పారదర్శకమైన, పొదుపు తో కూడిన పాలనను అందించడమే లక్ష్యంగా ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు.

రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన 'గ్రోక్'.. ప్రధాని మోడీ వైపే ఏఐ మొగ్గు

మోదీ పిలుపు.. కాన్వాయ్‌ని తగ్గించిన పవన్ కళ్యాణ్

Next Story