వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారు : సీఎం చంద్రబాబు నాయుడు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-01 11:30:38  IST  )

తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ అంశంపై తాను NDDB నివేదిక వచ్చాకే మాట్లాడానని, అయినా వైసీపీ నేతలు నానా యాగీ చేశారని వాపోయారు.

వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారు : సీఎం చంద్రబాబు నాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ అంశంపై తాను NDDB నివేదిక వచ్చాకే మాట్లాడానని, అయినా వైసీపీ నేతలు నానా యాగీ చేశారని వాపోయారు. కల్తీ నెయ్యి ఘటనలో చర్యలు తీసుకునేందుకు సిట్ వేస్తే.. రివర్స్ లో తననే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సీఎం హోదాలో తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని చంద్రబాబు తెలిపారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడి వైసీపీ నేతలు తిరుమలలో మహాపాపం చేశారని, వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారని పేర్కొన్నారు. తప్పు చేయడమే కాకుండా.. ఎదురుదాడి చేయడం శోచనీయమన్నారు.

తిరుమల పవిత్రతను కాపాడటంలో భాగంగానే శ్వామలరావును పంపామని స్పష్టం చేశారు. ఆ సమయంలోనే ఆయన NDDB నివేదిక అడిగారని, అది వచ్చాకే తానూ స్పందించానని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. లడ్డూ తయారీకి వాడుతున్న నెయ్యిలో జంతుకొవ్వులు ఉన్నాయని ఆనాడే చెప్పినందుకు, కాదని వారించి సుప్రీంకోర్టు వరకూ వెళ్లారన్నారు. తప్పు చేశారని సూటిగా అడిగితే వైసీపీ నేతల ప్రవర్తన ఎలా ఉంటుందనేందుకు ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. తిరుమలకు తాను సామాన్య భక్తుడిగానే వెళ్లి సేవలు చేస్తానని, ఏనాడూ వైకుంఠ ద్వారం నుంచి దర్శనం చేసుకోలేదని, అదజి తన అలవాటు అని సీఎం తెలిపారు. దేవుడిపై నమ్మకం లేకపోతే వదిలేయవచ్చు కానీ.. అపచారం చేయడం మహాపాపంతో సమానమన్నారు.

MORE NEWS : ఏపీకి చాలా లాభదాయకం.. కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన సీఎం చంద్రబాబు

Next Story