- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి చాలా లాభదాయకం.. కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన సీఎం చంద్రబాబు
కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి చాలా లాభదాయకమని సీఎం చంద్రబాబు తెలిపారు...

దివ, వెబ్ డెస్క్: పార్లమెంట్ సమావేశాల్లో(Parliament Sessions) ఆదివారం 2026-27 వార్షిక బడ్జెట్(Annual Budget)ను కేంద్రం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) స్పందించారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్ కు లాభం జరుగుతుందన్నారు. ఈ బడ్జెట్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. మూడు హైస్పీడ్ ట్రైన్ కారిడార్లతో రాష్ట్రానికి లాభం జరుగుతుందని తెలిపారు. దీర్ఘకాలం లాభాలు అందించేలా బడ్జెట్ రూపొందించారని కొనియాడారు. టెక్నాలజీతో దేశంలో చాలా మార్పు వస్తాయన్నారు. ఏఐ టెక్నాలజీని మన దేశం శరవేగంగా అందిపుచ్చుకుంటోందని చెప్పారు. అరుదైన ఖనిజాలు వెలికితీయడం వల్ల ఏపీలో అభివృద్ధి త్వరగా సాధ్యమవుతుందని చంద్రబాబు తెలిపారు. అరుకు టూరిజం అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు మంచి పరిణామమని పేర్కొన్నారు. సెమీ కండక్టర్ల రంగానికి ఐఎస్ఎమ్ 2.0 ఎంతో ఊతమిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.






