- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
APSRTC పని తీరుపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
APSRTC పని తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ..

దిశ, వెబ్ డెస్క్: APSRTC పని తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ప్రశంసించారు. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం(Sthri Shakti Scheme) విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సంతృప్తి వ్యక్తి చేసింది. రాష్ట్రంలోని ఉచిత బస్సు ప్రయాణం(Free bus travel)పై మహిళలనుంచి ఫీడ్ బ్యాక్ చాలా బాగుందని, ఇలా ఆర్టీసీ సేవలు కొనసాగించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో మంత్రులు, కార్యదర్శుల సమీక్ష సమావేశంలో APSRTCకి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Minister Mandipalli Ramprasad Reddy) సమక్షంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రశంసలు కురిపించారు.
రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ...
ఈ సందర్బంగా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ స్త్రీ శక్తి ద్వారా రూ. 4 కోట్ల మంది మహిళా ప్రయాణికులకు ఉచిత సేవలను అందించామని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రశంసలతో తమకు బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. శ్రీ శక్తి పథకం బరువు కాదు బాధ్యతగా స్వీకరించి సేవలు అందిస్తామని, భవిష్యత్తులో ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.






