- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షేత్రస్థాయిలో ఉదాసీనత.. ఉన్నతాధికారులకు పవన్ కీలక పిలుపు
రాష్ట్ర రాజధాని అమరావతిలో మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర రాజధాని అమరావతిలో(Amaravati) మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) ప్రసంగించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేస్తున్న పథకాలపై సమీక్షించుకుంటున్నామని తెలిపారు. పల్లె పండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 11,328 కోట్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా రూ. 10 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభం అయ్యాయన్నారు. నగర వనాలతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అటవీశాఖ ద్వారా చేపడుతున్నామని పవన్ పేర్కొన్నారు.
కూటమి కట్టుబడి ఉంది
తక్కువ ఆర్ధిక వనరులతోనే రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. నిధుల కొరత ఉన్నప్పటికీ నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో ఉదాసీనత లేకుండా పని చేయాలి... దీనిని అధిగమించేలా మన కార్యచరణ ఉండాలని తెలిపారు. ఈ గ్యాప్స్‌ను సవరించుకుని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో అమలు అవుతున్న కార్యక్రమాల్ని పర్యవేక్షించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.






