రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. పమిడిముక్కల వేదికగా సీఎం కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-01 10:48:46  IST  )

రాష్ట్ర ప్రజలకు కృష్ణా జిల్లా పమిడిముక్కల వేదికగా సీఎం చంద్రబాబు భారీ ఊరటనిచ్చే ప్రకటన చేశారు. విద్యుత్ ఛార్జీల పెరుగుదలపై ఆందోళన చెందుతున్న సామాన్యులకు ఆయన భరోసా ఇచ్చారు..

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. పమిడిముక్కల వేదికగా సీఎం కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రజలకు కృష్ణా జిల్లా పమిడిముక్కల(Krishna District, Pamidimukkala) వేదికగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) భారీ ఊరటనిచ్చే ప్రకటన చేశారు. విద్యుత్ ఛార్జీల(Electricity Charges) పెరుగుదలపై ఆందోళన చెందుతున్న సామాన్యులకు ఆయన భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల వరకు ఒక్క పైసా కూడా ఛార్జీలు పెంచబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలపై అదనపు భార పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి..

గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో జరిగిన లోపాలను ఎత్తిచూపుతూ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో ఏకంగా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం వల్ల భారమైన 'ట్రూఅప్' ఛార్జీల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తూ, తమ ప్రభుత్వం వాటిని 'ట్రూడౌన్' చేసిందని, తద్వారా వినియోగదారులకు లబ్ధి చేకూరిందని చంద్రబాబు తెలిపారు.

ఆందోళన చెందవద్దు..

రాష్ట్ర విద్యుత్ రంగాన్ని మళ్లీ గాడిన పెట్టడంతో పాటు నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు . గత పాలకుల విధానాల వల్ల విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయని, తాము అధికారంలోకి వచ్చాక సంస్కరణల ద్వారా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ పాలన సాగుతుందని, విద్యుత్ ఛార్జీల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

విశాఖ తర్వాత కృష్ణా జిల్లానే నంబర్ 1 : పోలవరంపై క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు

Next Story