- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ తర్వాత కృష్ణా జిల్లానే నంబర్ 1 : పోలవరంపై క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు
పెన్షన్ల పంపిణీని ప్రభుత్వం ఒక భారంగా కాకుండా బాధ్యతగా భావిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

దిశ, వెబ్‍డెస్క్: పెన్షన్ల పంపిణీని ప్రభుత్వం ఒక భారంగా కాకుండా బాధ్యతగా భావిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో నిర్వహించిన 'పేదల సేవలో ప్రజా వేదిక' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీతో పాటు పలు అభివృద్ధి పనులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సంక్షేమానికి పెద్దపీట: ఏటా రూ.33 వేల కోట్లు
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, పేదల రుణం తీర్చుకునేందుకు ప్రతినెలా ఒకటో తారీఖున పెన్షన్ల నిధులు సిద్ధంగా ఉంచుతున్నామని సీఎం తెలిపారు. దీనికోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. "ప్రజల ముఖాల్లో సంతోషం చూస్తుంటే నా కష్టమంతా మర్చిపోతున్నా.. ఏపీకి పూర్వవైభవం తేవడమే నా లక్ష్యం" అని ఆయన ఆకాంక్షించారు.
పోలవరం & అభివృద్ధిపై కీలక ప్రకటన
2027 గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 2019లోనే కూటమి ప్రభుత్వం ఉండి ఉంటే పోలవరం ఇప్పటికే పూర్తయ్యేదని అభిప్రాయపడ్డారు. అలాగే బందరు పోర్టు పనులు 57 శాతం పూర్తయ్యాయని, విశాఖ తర్వాత రాష్ట్రానికి కృష్ణా జిల్లా ఆదాయ వనరుగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీపై విమర్శనాస్త్రాలు.. 'అది గొడ్డలి పార్టీ'
వైసీపీ పాలనపై విరుచుకుపడుతూ.. అది వైఎస్సార్ కాంగ్రెస్ కాదు, 'గొడ్డలి పార్టీ' అని ఎద్దేవా చేశారు. "వివేకాను వారే హత్య చేసి, కత్తి నా చేతిలో పెట్టి తప్పుడు ప్రచారం చేశారు. స్వాతంత్య్రం తర్వాత ప్రజలకు మళ్లీ స్వేచ్ఛను తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే" అని అన్నారు.
ఎమ్మెల్యేలకు హెచ్చరిక
పాలనలో అలసత్వం వహించే ప్రజాప్రతినిధులకు సీఎం గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఎమ్మెల్యేలంతా సమర్థంగా పనిచేయాలని, నిరంతరం ప్రజల్లో ఉండాలని సూచించారు. పనిచేయని వారికి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉండదని స్పష్టం చేశారు. మహిళా సాధికారత, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా లేబర్ అడ్డాలను తీర్చిదిద్దడం వంటి అంశాలను కూడా సీఎం ప్రస్తావించారు.






