- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఉప్పునూతల వెంకటేష్ యాదవ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా సోమవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, భూదాన్ పోచంపల్లి : భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఉప్పునూతల వెంకటేష్ యాదవ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా సోమవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు కళ్లెం రాఘవరెడ్డి, జిల్లా నాయకులు పాక మల్లేష్ యాదవ్, పీఎసీఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, వంకమామిడి సర్పంచ్ మచ్చ శ్రీనివాస్, ఎరుపుల శ్రీనివాస్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గుత్తి బాలశంకర్, శాపాక శంకర్ తదితరులు పాల్గొన్నారు.






