- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ దారి రైతుల అవస్తలు
మండల పరిధిలోని వర్ధమానుకోట, నర్సింహుల గూడెం గ్రామ ప్రజలు, రైతులు రహదారి లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, నాగారం : మండల పరిధిలోని వర్ధమానుకోట, నర్సింహుల గూడెం గ్రామ ప్రజలు, రైతులు రహదారి లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్లుగా మట్టి దారిపైనే వెళ్తూ అవస్థలు పడుతున్నారు. అభివృద్ధిని ఎప్పటికైనా చూడాలనుకుంటున్నారు. రోడ్డు వేయండి మహాప్రభో అంటూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు గ్రామస్థుల విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా వర్ధమానుకోట, నర్సింహుల గూడెం గ్రామాలకు చెందిన రైతుల వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే ఆ దారివెంటే వెళ్లాల్సి ఉంది. ప్రతి వర్షాకాలం మొదలైతే చాలు ఆదారి నరకప్రాయంగా మారుతోంది. అడుగడుగునా మోకాలు లోతు గుంతలు ఏర్పడటంతో రైతులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శిలాఫలకాలకే పనులు పరిమితం..
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వర్ధమానుకోట నుండి జాజిరెడ్డి గూడెం (వయా)నర్సింహుల గూడెం వయా, కంచుగట్ల గూడెం, తుంగగూడెం వరకు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద 227 లక్షలు వ్యయంతో 6.491 కి.మీటర్ల రోడ్డు మంజూరు అయినది. కాగా అప్పటి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ శంకుస్థాపన చేసినా, పనులు శిలాఫలకానికే పరిమితమయ్యాయి. ఈ రోడ్డు నిర్మించడం ద్వారా హైదరాబాద్ కు వెళ్లే జాతీయ రహదారిని కలపడంతో నాగారం మండల వాసులకు హైదరాబాదుకు వెళ్లడానికి దగ్గర దారి అవుతుందని అందరూ భావించారు. కానీ ఇది ఆచరణకు నోచుకోలేదు. శంకుస్థాపన సమయంలో ఆనాటి పాలకులు ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వస్తాయని చెప్పారు. దాంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఆ ఆశలన్నీ అడియాశలుగానే మిగిలిపోయాయి.
దారి చూసైన దయ చూపండి.. వర్ధమానుకోట గ్రామానికి చెందిన రైతు కంబాల మల్లేష్ యాదవ్
పండించిన పంటను తరలించాలంటే నరకం చూడాల్సి వస్తుంది. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళాలంటే మోకాలు లోతు గుంతలతో ఉన్న ఆ దారి వెంట వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలస్సిందే. వడ్లను ట్రాక్టర్ సహాయంతో పొలం దగ్గర నుండి కొనుగోలు కేంద్రానికి తరలిస్తుండగా లోతైన గుంతలు ఉండడం వలన వడ్ల లోడుతో ఉన్న ట్రాక్టర్ పల్టీ కొట్టి వడ్లన్ని నేలపాలయ్యాయి. నేను 45 వేల రూపాయలు నష్టపోయాను. ఈ దారి ప్రాంత రైతుల మేలుకోసం వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టి రోడ్డు వేయాలని కోరారు.
పనులు వెంటనే ప్రారంభిస్తాం.. డీఈఈ బాబురావు
రైతులు, ఆ దారి ప్రజల సౌకర్యార్థం వర్ధమానుకోట నుండి జాజిరెడ్డిగూడెం వయా నర్సింహులగూడెం, కంచుగట్ల గూడెం, తుంగగూడెం వరకు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద 227 లక్షలు వ్యయంతో 6.491 కి.మీటర్ల రోడ్డు మంజూరు అయిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని "దిశ" తో పంచాయతీ రాజ్ డీఈఈ బాబురావు తెలిపారు.






